విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని మార్కెట్ వీధిలో గల శ్రీ మార్కండేయ స్వామి దేవాలయంలో ఈనెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు శ్రీ భద్రావతి భావన రుచంద్రుల వారి 58 వ ఎనిమిదవ కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మొదటి రోజు ఆదివారం అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత సాయంత్రం శ్రీ లలితా నాట్య కళానికేతన్ గురువులు బాబు బాలాజీ భార్య కమల బాలాజీ వారి శిష్య బృందంతో భరతనాట్య ప్రదర్శన నిర్వహించారు. ఈ భరతనాట్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ లలిత నాట్య కళానికేతన్ గురువులు ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలలో ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఈ కళ్యాణ మహోత్సవ వేడుకల్లో తాము పాలు పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని బాబు బాలాజీ తెలిపారు. ప్రతి దేవాలయములో మా శిష్య బృందంతే భరత, కూచిపూడి నాట్యాలను ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం శ్రీ పద్మశాలియ బహుత్ తమ సంఘం వారు బాబు బాలాజీ, కమలా బాలాజీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నృత్యం చేసిన చిన్నారుల తల్లిదండ్రులు, ఆలయ కమిటీ సభ్యులు, పద్మశాలీయ కుల బాంధవులు పాల్గొన్నారు.