తొగట వీర క్షత్రియ సంఘం
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని గాంధీ నగర్ లో గల తోకటవీర క్షత్రియ కళ్యాణ మండపమునందు ఆగస్టు ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ధర్మవరం పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు 540 మార్కులు పైబడి సాధించిన వారికి తోకటవీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్లు కమిటీ వారు తెలిపారు. కావున ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులు మార్కు లిస్టు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధారు కార్డు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఆగస్టు 5వ తేదీ లోపు తెలిపిన ఫోన్ నెంబర్లకు సమాచారాన్ని ఇవ్వవలసినదిగా వారు కోరారు. సెల్ నెంబర్లు 9440565933 లేదా 9440844383 లేదా 9440664828కు సమాచారం అందించాలని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని తొగట వీర క్షత్రియ కుల బాంధవులు పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.