ఆగస్టు 1న సీఎం దృష్టికి తీసుకెళ్తాం.. ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఎస్. రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి.
విశాలాంధ్ర ధర్మవరం:: ఎస్సీ ఎస్టీలకు పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకోవడం అన్యాయమని, ఆగస్టు ఒకటవ తేదీన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని, పింఛన్లు అడ్డుకోవడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఎస్,రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో వారు విలేకరులతో మాట్లాడుతూ
అర్హులైన ఎస్సీ ఎస్టీలకు అన్ని రకాల పింఛన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటి నెల లోనే ఎస్సీ,ఎస్టీ అన్యాయం చేసే విధంగా కొన్ని ప్రాంతాల్లో పింఛన్లు ఆపివేయడం అన్యాయం అని ధ్వజమెత్తారు. నిరుపేదలైన దళిత,గిరిజనులను రాజకీయ వివక్షత కనబరుస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండామోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా వృద్ధులు, వితంతువులు,వికలాంగులు,డప్పు చర్మ కళాకారులకు పింఛన్లు ఇవ్వకుండా ఏక కాలంలో అడ్డుకోవడం దారుణమన్నారు. ఎస్పీ,ఎస్టీలకు రాజకీయ ప్రాధాన్యత ఎక్కడ ఉండదని, కేవలం ఓటర్లుగా, అనుచర వర్గంగా వాడుకుంటారని అలాంటి వారిపై రాజకీయ కక్ష కట్టడం సరికాదన్నారు.కొన్నిచోట్ల తెలుగుదేశం నాయకులు బహిరంగంగానే మీకు పింఛన్లు ఇవ్వము లిస్టులో పేర్లు లేకుండా తొలగిస్తామనడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. కొన్ని ప్రాంతాల్లో దళిత,గిరిజనుల పేదరిక, బలహీనతను ఆసరాగా చేసుకొని ప్రభుత్య పథకాలు కావాలంటే మా ఇళ్లల్లో పనులు చేయాలి, మేము చెప్పినట్లు వినాలని హుకుం జారీ చేయడం సిగ్గుచేటున్నారు.ఇప్పటికే ఇవ్వకుండా ఆపేసిన 7000 పింఛన్ తో పాటు ఆగస్టు నెల నుంచి తప్పనిసరిగా పింఛన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి మడకశిర పర్యటనలో తీసుకెళ్తామన్నారు.అలాగే ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను అర్జీ రూపంలో ముఖ్యమంత్రి విన్నవించుకోవడానికి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ కోరడం జరుగుతుందన్నారు. మా సమస్యలు విన్నవించుకోవడానికి ముఖ్యమంత్రి కలుసు కోవడానికి అనుమతించకపోతే దళిత,గిరిజన బాధితులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన,నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుడు పాపిరెడ్డిపల్లి పృథ్వి,విద్యార్థి నిరుద్యోగ పోరాట ఐక్య వేదిక వినోద్ కుమార్,ఎస్సీ ఎస్టీ జేఏసీ చిరంజీవి,రామకృష్ణ.ఓబులేష్,వెంకటేష్,మల్లెష్, భాధితులు పద్మ.వెంకటమ్మ.నారాయణమ్మ. లక్ష్మక్క. కల్పన తదితరులు పాల్గొన్నారు.