విశాలాంధ్ర ధర్మవరం: కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం సందర్భంగా ధర్మవరం పట్టణం లోని
కే. హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ సి సి క్యాడేట్లు ర్యాలీను కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కళాశాలలో సమావేశాన్ని నిర్వహించి, కార్గిల్ యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగిందన్నారు.కార్గిల్ యుద్ధం జరిగి 25ఏళ్లు గడిచిన సందర్భంగా అప్పటి స్మృతులను స్మరించు కోవడం జరిగిందన్నారు. 30 ఏళ్లలో 45 వేల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, భారత్ పాకిస్తాన్ మధ్య జరింగి జరిగిన భయంకరమైన యుద్ధాల్లో కార్గిల్ వార్ ఒకటి అని, కార్గిల్ కు ముందు ఆ తర్వాత కూడా ఇరుదేశాల మధ్య సంఘర్షణలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. దేశం కోసం మృతి చెందిన దేశ సైనికులకు నివాళులు అర్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని దేశ రక్షణే తమ ఊపిరిగా తమ ప్రాణాలను పన్నంగా పెట్టి, దేశాన్ని దేశ సైనికులు రక్షించడం జరిగిందని తెలిపారు. కార్గిల్ యుద్ధం అధికారికంగా 1999 జులై 26న ముగిసిందని, ఈ పోరులో 559 మంది భారత సైనికులు వీర మరణం పొందడం అంతేకాకుండా ఒక 1 536 మంది సైనికులు గాయపడటం వీర మరణం పొందిన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ నేడు విజయ్ దివాసును నిర్వహిస్తున్నామని పాకిస్తాన్ సైన్యాన్ని తరిమికొట్టి కార్గిల్ ప్రాంతాన్ని రక్షించి వీర గతిని పొందిన అమరవీరుల త్యాగం మరువలేనిదని దేశ ప్రజలకు రక్షణగా నిలుస్తున్న మన దేశ సైనికుల పోరాటం అసామాన్యమని, అనితర సాధ్యమని తెలిపారు. దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందిన అమర జవానులకు మనమందరం అంజలి ఘటించాల్సిన బాధ్యత అందరిమీద ఉందని, వీరోచిత పోరాటంలో కార్గిల్ యుద్ధం గెలిచిన రోజు అని, ప్రతి భారతీయుడు గర్వించాల్సిన రోజు కార్గిల్ విజయ్ దివాస్ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. కె. ప్రభాకర్ రెడ్డి గారు ఎన్ సి సి అధికారి యస్. పావని, డా॥ ఎస్. షమీఉల్లా ,ఎ.కిరణ్ కుమార్, యం. భువనేశ్వరి యం.వెంకటలక్ష్మి, యం పుష్పవతి. వై. తాహీర్ .యం.సరస్వతి, బి. ఆనంద్ . జీ.మీనా బి. గంగా తదితర అధ్యాపక అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.