Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

మాదిగల రాజకీయ చైతన్య సభ

విశాలాంధ్ర -పెనుకొండ పెనుకొండపట్టణము నందు శుక్రవారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాజకీయ చైతన్య సభను ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వహించారు ,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు, పాల్గొన్నారు మొదటగా డబ్బులతో పట్టణ పురవీధుల గుండా ఊరేగించి మాదిగలలో రాజకీయ చైతన్యం రావాలని రాజ్యాధికారం కావాలని ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ కావాలని నినాదాలు చేశారు అలాగే సభ నిర్వహించారు ఎస్సీలలో మాదిగలకు రాజకీయ చైతన్యము తక్కువగా ఉన్నందున అన్ని రాజకీయ పార్టీలు కూడా మాదిగలకు తక్కువ టికెట్లు కేటాయిస్తూ మాదిగలను రాజకీయంగా ప్రేరేపించకుండా అవసరాలకు వాడుకుంటున్నారని మాకు దక్కాల్సిన రిజర్వేషన్ ఫలితాలు మాకు అందాల్సిందేనని వక్తలు పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలోశివ రామకృష్ణ అడ్వాకేట్ , ఓబీలేసు. నరసింహులు, రవి ,కుళ్లాయప్ప , మద్దిలేటి, వెంకటేష్ . తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img