మిస్సింగ్ వ్యక్తిని ట్రేస్ చేసిన కియా పోలీసులు
విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ డివిజన్ పరిధిలోని కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్ లో 2023 ఏప్రిల్ నెలలో శ్రీకాకుళం జిల్లా వాసి దుర్గా ప్రసాద్ కియా పోలీస్ స్టేషన్ కి వచ్చి తన బావ మరిది వెంకటేష్ కియా కంపెనీ లో పని చేస్తున్నాడని, ప్రతి నెల అతని తల్లిదండ్రులకు ఫోన్ పే ద్వారా జీతము కూడా పంపించేవాడని, సంక్రాంతికి ఇంటికి వచ్చి నెల రోజులు ఉండి తిరిగి మళ్ళీ డ్యూటీ నిమిత్తం కియా కంపెనీ కి బయలుదేరి వెళ్ళాడని, అప్పటినుండి తల్లి దండ్రుల తో మాట్లాడుతూ వుండే వాడని, చివరగా ఏప్రిల్ 08 వ తేదీ స్వగ్రామానికి వస్తున్నాడని ఫోన్ మాట్లాడుతూ అనంతపురం రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కుతున్నాను అని మాట్లాడి ఆ తరువాత స్విచ్ ఆఫ్ రావడం తో, మిస్సింగ్ పర్సన్ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు చాలా చోట్ల వెతికినా కనబడలేదు ,అని చివరగా అనంతపురం జిల్లా కియా కంపెనీలో పని చేస్తున్నాడు అని చెప్పినందున మిస్సింగ్ అయిన వ్యక్తి బందువులు కియా కంపెనీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా పలితం లేనందున కియా పోలీస్ స్టేషన్లో పిర్యాదు ఇవ్వగా కియా పోలీసుల దీనిపై కనబడుటలేదు కేసు నమోదు చేశారు. దర్యాప్తు లో బాగంగా మిస్సింగ్ పర్సన్ వెంటకేస్ అస్సలు కియా కంపెనీలో పని చేయనే లేదని పెనుకొండ,అనంతపురం పరిసర ప్రాంతాలలో కూడా పని చేయలేదని తేలింది. చెన్నై లో ఉంటూ ప్రైవేటు జాబ్ చేసుకుంటూ, చెన్నై లో జాబ్ చేస్తున్నాడు అంటే తల్లిదండ్రులు ఒప్పుకోరని, అలాగే కియా కంపెనీ అంటే మంచి పేరు, మరియు మనం రాష్ట్రం లో అయితే తల్లిదండ్రులు బయపడరని, అలాగే తల్లిదండ్రులు వయసు పైబడినందున కొడుకు వెంకటేష్ నీ పెళ్లి చేసుకొమ్మని బలవంతం చేస్తున్నారని పెళ్లి సంబంధం చూడటానికి రమ్మంటే ఇష్టం లేక తల్లి దండ్రులకు అబద్దం చెప్పినాడు, అదే సమయం లో తన వద్ద గల సెల్ ఫోన్ పోవడం తో కాంటాక్ట్ నంబర్లు పోయాయని తెలిపాడు. చివరగా పోలీసులు టెక్నికల్ గా కాంచీపురం తమిళనాడు లో వుండగా ట్రేస్ చేసి తల్లిదండ్రులకు తెలపి తప్పిపోయిన వ్యక్తి ని, కియా పోలీసులు పెనుకొండ తహశీల్దార్ వద్ద హాజరు పరిచడం జరిగింది.కియా కంపెనీ లో కానీ అనంతపురం చుట్టూ పక్కల కానీ పని చేయక పోయినా,నివాసం లేకపోయినా, కనీసం కియా పరిధిలోకి వచ్చి అక్కడి నుండి మిస్సింగ్ కాకున్నా, కేవలం శ్రీ కాకులం నుండి మిస్సింగ్ అయిన వ్యక్తిని వెతుకుతూ బందువులు కియా పోలీస్ స్టేషన్ లో జరిగింది చెప్పగా, మన ఏరియాలో నివాసం లేనప్పటికీ , స్టేషన్ కి వ్యక్తి కనబడలేదు అని వచ్చినపుడు కేసు నమోదు చేయమని చెప్పడం తో కియా పోలీసులు వెంటనే ఆలస్యం చేయకుండా ఎస్సై వెంకట రమణ కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే దర్యాప్తు చేసి మిస్ అయినా వ్యకిని ట్రేస్ చేసి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. తమ పరిధి లో నేరం జరగనప్పటికి కేసు నమోదు చేసి మిస్స్ అయిన వ్యక్తికి ట్రేస్ చేయడం తో ఉన్నతాధికారుల కియా పోలీసులను అభినందించారు.