విశాలాంధ్ర, రాప్తాడు : నియోజకవర్గ కేంద్రం రాప్తాడు మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన టీవీ శ్రీహర్షకు పలువురు టిడిపి నాయకులు సోమవారం పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల్లో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటానని సీఐ అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ జాఫర్, సర్పంచులు మిడతల శీనయ్య, బండి ఉజ్జినప్ప, నరేష్, నాయకులు నాగప్ప నారా నారాయణ, నారాయణస్వామి, ముత్యాలప్ప తదితరులు ఉన్నారు.