సిఐటియు మండల కమిటీ డిమాండ్
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వ పాఠశాలల్లో స్వీపర్షగా విధులు కొనసాగిస్తున్న వారందరికీ కనీస వేతనం అమలు చేయాలని సిఐటియు మండల కన్వీనర్ జే వి. రమణ, కో కన్వీనర్ ఆదినారాయణ తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యాలయంలో స్వీపర్షకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దాదాపుగా 20 సంవత్సరాలుగా స్వీపర్షగా పనిచేస్తున్న వారికి కేవలం 4000 రూపాయలు వేతనం ఇవ్వడం సరికాదని, వారి కష్టాన్ని గుర్తించి తగిన న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాల పోషణ చాలా ఇబ్బందికరంగా మారిందని, నిత్యావసరల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వారు వాపోయారు. సిఐటియు ఆధ్వర్యంలో వివిధ రకాలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మారడం తప్ప స్వీపర్ష యొక్క తలరాతలు మారడం లేదని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వారి శ్రమను గుర్తించి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ స్లిప్పర్స్ నాయకురాలు జయమ్మ, చౌడమ్మ ,ముంతాజ్, నాగలక్ష్మి తో పాటు అధిక సంఖ్యలో స్వీపర్సు పాల్గొన్నారు.