విశాలాంధ్ర- చిలమత్తూర్ రూరల్ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యేల ఫోటోలను పెట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ టేకులోడు గురుకుల పాఠశాలలో మాత్రం నిబంధనలు గాలికి వదిలేసినట్లు తెలుస్తుంది. చిలమత్తూరు మండల పరిధిలోని గురుకుల పాఠశాలలో నియోజకవర్గ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫోటో పెట్టలేదు, ఆ గురుకుల పాఠశాలను దివంగత నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు సమక్షంలో పేద విద్యార్థినీ విద్యార్థులు విద్యను అభ్యసించి అభివృద్ధి చెందాలని ఉద్దేశ్యముతో అప్పట్లో పాఠశాల కోసం శంకుస్థాపన చేసి, నిర్మాణాలు చేపట్టి ప్రారంభోత్సవాలు జరిపిన విషయం అందరికీ తెలిసిందే, అంతేకాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయానా వియ్యంకుడు, అయినటువంటి ఎమ్మెల్యే లెజెండ్ బాలయ్య ఫోటో పెట్టకపోవడంపై స్థానిక టిడిపి నాయకుల్లో ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం అవుతున్నాయి, వీరితోపాటు కొంతమంది విద్యార్థినీల తల్లిదండ్రులలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఫోటో ఎందుకు పెట్టలేదు అంటూ బహిరంగంగా చర్చించుకుంటున్నారు.ఇప్పటికైనా సంబంధితఅధికారులు,నాయకులు,ప్రజాప్రతినిధులస్పందించి స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు, కొంతమంది విద్యార్థినిల తల్లిదండ్రులు కోరుతున్నారు.