అప్పుడే ప్రజల వద్ద మంచి గుర్తింపు లభిస్తుంది..
డిప్యూటీ ఇన్ఫోసిమెంట్ బ్యూరో విజయ శేఖర్
విశాలాంధ్ర ధర్మవరం : విధుల పట్ల బాధ్యతతో వ్యవహరించినప్పుడే ప్రజల వద్ద మనకు మంచి గుర్తింపు, మంచి పేరు లభిస్తుందని డిప్యూటీ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విజయ శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని స్బ్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్లోని పలు రికార్డులన్నీ కూడా వారి తనిఖీ చేశారు. తదుపరి అధికారులకు సిబ్బందికి విధుల పట్ల పాటించాల్సిన సూచనలను, సలహాలను తెలియజేశారు. తదుపరి స్టేషన్లోని పలు కేసుల రికార్డులను, ప్రాపర్టీని తనిఖీ చేసి వాటి పరిష్కారం యొక్క సూచనలను తెలియజేశారు. అక్రమ మధ్యము, నాటుసారా, గంజాయి లాంటి మత్తు పానీయాల క్రయ,విక్రయాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిమీద ఉందని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా గ్రామ పట్టణ ప్రజలకు గంజాయి వినియోగం వలన కలిగే నష్టాలు, చట్టపరమైన కేసుల వివరాలను అవగాహన సదస్సుల ద్వారా తెలియజేసి, అరికట్టే విధంగా అధికారులు, సిబ్బంది తమ విధులను నిర్వర్తించాలని తెలియజేశారు. పట్టణాలు గానీ గ్రామాలలో గాని గంజాయి, అక్రమ మద్యం అమ్మకాలు జరిగిన ఎడల ప్రజలు స్బ్ పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి పేరును గోపెయంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేబ్ ఇన్స్పెక్టర్ గురు ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.