– పాత పెన్షన్ విధానం మాత్రమే అమలు చేయాలి
– యుటిఎఫ్ డిమాండ్
విశాలాంధ్ర ధర్మవరం: ఉద్యోగ, ఉపాధ్యాయులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూనిఫైడ్ పెన్షన్ స్కీం(యుపిఎస్ ), గ్యారెంటీ పెన్షన్ స్కీమ్(జిపిఎస్), కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్) వీటిని రద్దుచేసి పాత పెన్షన్ విధానం(ఓ పి ఎస్) మాత్రమే అమలు చేయాలని యుటిఎఫ్ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రా రెడ్డి స్థానిక ధర్మవరం పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట యుటిఎఫ్ ధర్మవరం డివిజన్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం మాత్రమే అమలు చేయాలని, పెన్షన్ బిక్ష కాదు అది ఉద్యోగుల హక్కు అని గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పాలకపక్షాలు అనుసరించి, అందరికీ ఆమోదకరమైన పాత పెన్షన్ విధానం మాత్రమే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొని రావడం దారుణమని ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలని, అలాగే రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయకుండా 117 జీవోను రద్దు చేయకుండా వర్క్ అడ్జస్ట్మెంట్ మండల స్థాయిలో కాకుండా డివిజన్ జిల్లా స్థాయిలో నిర్వహించడం తగదని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరసన ప్రదర్శన అనంతరం ధర్మవరం రెవెన్యూ అధికారి ఎమ్మార్వో నటరాజ్ యుటిఎఫ్ నాయకులు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ధర్మవరం డివిజన్ యుటిఎఫ్ నాయకులు రామకృష్ణ నాయక్, లక్ష్మయ్య, ఆంజనేయులు, అమర్ నారాయణరెడ్డి, హరికృష్ణ, సాయి గణేష్, రాంప్రసాద్, సకల చంద్రశేఖర్, బిల్లె రామాంజినేయులు, బి. ఆంజనేయులు, జనార్ధన్ బాబు, కృష్ణతేజ, బాలాజీ, నారాయణ స్వామి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.