విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని గాంధీనగర్ సర్కిల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయమును ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తదుపరి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న నాయకులకు కార్యకర్తలకు వివిధ పోరాటాల ద్వారా సమస్యలను పరిష్కరిస్తూ టిడిపి పార్టీకి మంచి గుర్తింపును తేవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పట్టణ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా పట్టణంలోని గాంధీనగర్ సర్కిల్లో కార్యాలయమును ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, తమ సమస్యలను తెలుపుకోవచ్చునని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ సమస్యలను తెలుసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్తి కుమార్ యాదవ్ ద్వారా పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యము అని మరోసారి పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని, నియోజకవర్గంలో అన్ని సమస్యలు తప్పక పరిష్కారం అవుతాయని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తదుపరి పట్టణ సమస్యలను ఆయా ఇంచార్జ్ నాయకుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో పరిసే సుధాకర్, కమతం కాటమయ్య, మద్దిలేటి, పని కుమార్, భీమనేని ప్రసాద్ నాయుడు, మాధవరెడ్డి, గోట్లురు శ్రీనివాసులు, బీరే గోపాలకృష్ణ, బీబీ, కత్తుల సునీత, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.