విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని ప్రముఖ వ్యాపారవేత్త, దానశీలుడు, దాతృత్వం కలిగిన సంధరాఘవ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. పట్టణములోని చంద్రబాబు నగర్ లో రంగస్వామి అనే వ్యక్తి విద్యుత్ శాఖకు గురై మృతి చెందాడు. సమాచారం అందుకున్న తారక్ చేయుట ట్రస్టు ఆ కుటుంబానికి వెళ్లి పరిస్థితి విచారించగా, అంత్యక్రియలు చేయడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తయారుచేయుట ట్రస్ట్ వారు సంధ రాఘవను సంప్రదించగా, అప్పటికప్పుడే 10 వేల రూపాయల సహాయమును అందించారు. ఆ డబ్బులు తారచేయుట ట్రస్ట్ వారు మృతుడు రంగస్వామి కుటుంబానికి అందజేశారు.