విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని శివానగర్ యందు గల పట్టణ రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుభ్రం చేయడంతో పాటు చాలా సంవత్సరాలుగా పెరిగిన ముళ్ళకంపలను కూడా రజకులు తొలగించారు. అనంతరం పట్టణ కమిటీని జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి అగ్రహారం ముత్యాలు ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. ఈ నూతన కమిటీలో పట్టణ అధ్యక్షులుగా నరసింహులు, ఉపాధ్యక్షులుగా రామాంజనేయులు, శివయ్య, ఆంజనేయులు, గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా బాలు, కోశాధికారిగా అంకులప్ప, సహాయ కార్యదర్శిగా రమేష్, ముని కుమార్, శ్రీరాములు, శ్రీనివాసులు, మహిళా విభాగంలో వరలక్ష్మీ,గంగమ్మ ఎంపిక చేశారు. అనంతరం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ముత్యాలు మాట్లాడుతూ రజకుల సమస్యలపై నిరంతరం కృషి చేస్తామని, త్వరలో మంత్రి సత్య కుమార్ యాదవ్ను, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరాములు కలిసి సమస్యలను విన్నవిస్తామని తెలిపారు. ముఖ్యంగా రజకులను ఎస్సీ జాబితాలో కలిపే విషయాన్ని, ధర్మవరంలో మాడివేల మాచిదేవుని విగ్రహ ప్రతిష్టకు కూడా వినతి పత్రాన్ని అందిస్తామని తెలిపారు. కాబట్టి రజకులందరూ కూడా ఐక్యమత్యంతో సహకరిస్తే విజయవంతం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రజకులు పాల్గొన్నారు.