ఏ ఎఫ్ ఎకాలజీ సంస్థ.
విశాలాంధ్ర ధర్మవరం:: రైతులు పండించిన పంటలను దళారులకు అమ్మకుండా ఎఫ్.పి.ఓలకు మాత్రమే అమ్మకాలు చేసి మోసం లేకుండా ప్రయోజనం పొందాలని ఏఎఫ్ ఎకాలజీ సంస్థ, ఎఫ్ పి ఓ కోఆర్డినేటర్ శంకర్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని పోతుకుంట ఆర్డిటి పాఠశాల యందు సంఘం పాలకవర్గ సభ్యులు ఆధ్వర్యంలో సంస్థ సహకారంతో ఎనిమిదవ వార్షిక మహాసభలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఏఎఫ్ ఎకాలజీ సంస్థ ఎఫ్ పి ఓ కోఆర్డినేటర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ ధర్మవరం రైతు ఉత్పత్తిదారుల సంఘములో ధర్మవరం పరిధిలోని 22 గ్రామాల నుండి రైతులు 400 మంది సభ్యులుగా ఉన్నారని, వీరందరూ కూడా నేరుగా ఫ్యూలకు మాత్రమే అమ్మకాలు చేయాలని తెలిపారు. దీనివల్ల రైతులు మోసపోరని వారు తెలిపారు. అదేవిధంగా ఎఫ్ బి ఓ నుండి ఏర్పాటుచేసిన రైతు అంగళ్ల నుండి రైతులకు కావలసిన వ్యవసాయ పనిముట్లు, డ్రిప్పు స్పింకర్లు, తార్పల్లిను బట్టలు, స్ప్రేయర్లు, దాన, జొన్నలు, ఉలువలు, కందులు, ఆముదం మొదలైన విత్తనాలు మార్కెట్ తక్కువ ధరలకే సంఘంలో సభ్యులుగా ఉన్న రైతులకు అమ్మకాలు చేయడం జరుగుతుందని తెలిపారు. దీని ద్వారా వచ్చిన డబ్బులు వారి రైతు సంఘం ఖాతాలోకి డిపాజిట్ చేసి వారి యొక్క వాటాను పెంచడం జరుగుతుందని తెలిపారు. ఈ విధంగా రైతు సంఘం పనిచేయడం నిజంగా శుభదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం మండల టీం లీడర్ దస్తగిరి, ఎఫ్ పి ఓ మేనేజర్ ప్రతాప్ కుమార్, నంద, సీఈవోలు- నరసింహులు, మోహన్, ఎస్ టి వోలు విక్రమ్, ఎర్రి స్వామీ తదితరులు పాల్గొన్నారు.