Friday, December 8, 2023
Friday, December 8, 2023

అంతర్ జిల్లా పోటీలకు శ్రీ గణేష్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎంపిక.

విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) అంతర్ జిల్లా బాస్కెట్బాల్ పోటీలకు ధర్మవరం లోని సుందరయ్య నగర్ శ్రీ గణేష్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థి డి. తరుణ్ ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అండర్-17 విభాగంలో పదవ తరగతి చదువుతున్న టీ.తరుణ్ ఎంపిక పట్ల వారు సంతోషాన్ని ప్రకటించారు. గత నెల అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో ఈ ఎంపికలు జరిగాయని తెలిపారు. అనంతరం ఎంపికైన విద్యార్థికి పాఠశాల హెచ్ఎం తో పాటు ఫిజికల్ డైరెక్టర్ వీర, ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యార్థులు, పాఠశాల కమిటీ అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img