విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి మండలం నాగినయనిచెరువు తండా కి చెందిన బాపూజీ నాయక్, కుమారుడు లాల్ సింగ్ భరత్ చవాన్, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలలో గిరి పుత్రుడు మంచి ర్యాంకు సాధించడంతో ఆర్టీవో రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించాడు, తండ్రి రాజమండ్రి ఓఎన్ జిసిలో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు తల్లి తాడిపత్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తున్నారు అతను సివిల్ సర్వీసెస్ ఐపీఎస్ ఐఏఎస్ గా ఎంపిక కావాలని లక్ష్యంతో చదివినట్లు తెలిపారు,అతనికి ఉద్యోగం సాధించినందుకు మిత్రులు ఆనందం వ్యక్తం చేశారు .