విశాలాంధ్ర ధర్మవరం: ఆర్ డి టి (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) సహకారంతో స్పెయిన్ దేశానికి చెందిన “ఈగల బాస్కెట్ బాల్ క్లబ్” కు సంబంధించిన అంతర్జాతీయ బాస్కెట్ బాల్ కోచ్ లు మౌర్, ఒరియోల్, నటాలియా, పోల్ తదితర అంతర్జాతీయ స్థాయి కోచ్ లతో 18వ తేదీ గురువారం ఉదయం స్థానిక ధర్మవరం పట్టణ కాలేజీ మైదానం నందు గల బాస్కెట్ బాల్ కోర్టులో ప్రత్యేక శిక్షణ శిబిరం ప్రారంభమైన సంగతి విధితమే.. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక కాలేజ్ గ్రౌండ్ నందు ధర్మాంభ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్ శెట్టిపి జయచంద్రా రెడ్డి, అసోసియేషన్ కార్యదర్శి వాయల్పాడు హిదయతుల్లా చేతుల మీదగా బాస్కెట్బాల్ క్రీడాకారులకు ఉచితంగా స్పోర్ట్స్ డ్రెస్ తో పాటు, స్పోర్ట్స్ షూస్, బాస్కెట్బాల్స్ అందజేయడం జరిగింది అని ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి, ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్ సెట్టిపి జయచంద్రా రెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలోని స్థానిక క్రీడాకారులకు అంతర్జాతీయ కోచ్ లతో ఉచితంగా ఉదయం సాయంత్రం రెండు పూటలా శిక్షణా ఇవ్వడమే కాకుండా ఉచితంగా బాస్కెట్బాల్ క్రీడాకారులకు చేయూత ఇవ్వడం హర్షణీయమని, అభినందనీయమని స్పెయిన్ ప్రతినిధులకు , ఆర్ డి టి సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ అవకాశాలను క్రీడాకారులు ఉపయోగించుకొని భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని వారు తెలియజేశారు, గతంలో వీరి శిక్షణ వల్ల ధర్మవరం ప్రాంతానికి చెందిన స్థానిక క్రీడాకారులు రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయికి కూడా ప్రాతినిథ్యం వహించారు అని తెలిపారు. భవిష్యత్తులో వీరి ప్రత్యేక శిక్షణను ఉపయోగించుకొని మరింత ఎదగాలని తెలియజేశరు..ఈ కార్యక్రమంలో , కోచ్ సంజయ్, ఆత్మీయ ట్రస్ట్ సభ్యులు జస్వంత్,హరిజిత్ ప్రణవ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈ శిక్షణకు సహకరించిన జిల్లా అసోసియేషన్ కు ధన్యవాదములు తెలియజేశారు.