ధర్మాంబా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి.. సెట్టిపి జయచంద్రారెడ్డి
విశాలాంధ్ర- ధర్మవరం:: ఆర్డిటి వారి సహకారంతో ధర్మాంబా ధర్మాంబా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి.. సెట్టిపి జయచంద్రారెడ్డి. అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పెయిన్ దేశానికి చెందిన ఈ గల బాస్కెట్బాల్ క్లబ్ కు సంబంధించిన అంతర్జాతీయ బాస్కెట్ బాల్ కోచ్ లు మౌర్, ఓరి ఎల్, నటాలియా, పోల్ అను అంతర్జాతీయ సాయి కోచ్ లతో ఈ నెల 18వ తేదీ స్థానిక పట్టణ కాలేజీ మైదానమునందు ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని ప్రారంభించడం జరిగిందని ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్ శెట్టిపి జయ చంద్రారెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని స్థానిక క్రీడాకారులకు అంతర్జాతీయ కోచ్ లతో ఉచితంగా ఈ నెల మాసాంతం వరకు ఉదయము తో పాటు సాయంత్రము రెండు పూటలా శిక్షణా శిబిరాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని తెలిపారు. గతంలో వీరి శిక్షణ వల్ల ధర్మవరం ప్రాంతానికి చెందిన స్థానిక క్రీడాకారులు రాష్ట్ర ,జాతీయ స్థాయికి కూడా ప్రాతినిధ్యం వహించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో వీరి ప్రత్యేక శిక్షణను ఉపయోగించుకొని మరింత ఎదగాలని తెలిపారు. స్పెయిన్ బృందం వారు బాస్కెట్బాల్ క్రీడాకారులకు ఉచితంగా స్పోర్ట్స్ డ్రెస్ బాస్కెట్బాల్ అసోసియేషన్ సభ్యుల చేతులమీదుగా క్రీడాకారులకు ఉచితంగా అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వాయల్పాడు హిదాయత్తుల్ల, కోచ్ సంజయ్, ఆత్మీయ ట్రస్ట్ సభ్యులు జస్వంత్, హరిజిత్తు ప్రణవ్, తదితర క్రీడాకారులు పాల్గొన్నారు.