విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని గుట్ట కింద పల్లి లో గల పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లను నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి ఉత్తీర్ణత చెందినవారు పాలిసెట్ లో అర్హత పొందనప్పటికీ స్పాట్ అడ్మిషన్లకు అర్హులని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 29వ తేదీ లోపు తమ దరఖాస్తు తో పాటు సంబంధిత సర్టిఫికెట్ యొక్క జిరాక్స్లను జత చేసి కళాశాలలో సమర్పించాలని తెలిపారు. కావలసిన సర్టిఫికెట్లలో పాలిసెట్ 2024 హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, పదవ తరగతి మార్క్స్ కార్డు, పదవ తరగతి టిసి, నాలుగవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఆయా హైస్కూల్ హెడ్మాస్టర్ జారీచేసిన స్టడీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రం, ఫీజు వివరములు లలో ప్రాసెసింగ్ ఫీజు ఓసి, బిసి విద్యార్థులకు 700 రూపాయలు(పాలీసెట్ 2024 ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన వారికి మాత్రమే) ఉంటుందని, అదేవిధంగా 1100 రూపాయలు (పాలీసెట్ 2024 అర్హత సాధించని వారికి) సీటు పొందిన వారు 4700 రూపాయలు కళాశాలలోనే చెల్లించాలని తెలిపారు. స్పాట్ అడ్మిషన్ కు వచ్చే విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు మూడు సెట్లు జిరాక్స్ తప్పకుండా తీసుకొని రావాలని తెలిపారు. మా కళాశాలలో డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, డిప్లమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కలదని తెలిపారు. స్పాట్ అడ్మిషన్లు సీటు పొందిన వారికి ఎలాంటి స్కాలర్షిప్లు వర్తించవని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు గమనించి తమ పిల్లలను కళాశాలలో అడ్మిషన్లు చేర్పించాలని తెలిపారు.