విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని నాగులూరు గ్రామంలో గల రూప రాజా పిసిఎంఆర్ పాఠశాలలో విద్యార్థుల నడుమ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. పాఠశాలలోని చిన్నారులు శ్రీకృష్ణ, గోపిక, సత్యభామల వేషధారణలతో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహించుకున్న వైనం అందరినీ ఆకట్టుకుంది. తదుపరి ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొని ఉల్లాసంగా విద్యార్థులు గడిపారు. తదుపరి రూప రాజా బీసీ ఎంఆర్ చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ కృష్ణాష్టమి విశిష్టతను వారు వివరించడం జరిగిందని తెలిపారు. వేణుమాధవుడు లోకానికి గురువు, గీతను, బోధించి లోకములో ప్రతి ఒక్కరికి దారి చూపడం జరిగిందని తెలిపారు. చిన్నతనములో అల్లరి పిల్లాడుగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించడం జరిగిందని గోప పాలకుడిగా, సోదరినిగా, అసుర సంహారిగా, ధర్మ సంరక్షుడిగా ఎన్ని పాత్రలు పోషించిన అంతా లోక కళ్యాణం కోసమేనని తెలిపారు.శ్రీకృష్ణుని వేషధారణ అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు రూపా రాజా కృష్ణ, జగదీష్, కరస్పాండెంట్ నాగమోహన్ రెడ్డి, ప్రిన్సిపాల్ నరేష్ కుమార్ రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు,తదితరులు పాల్గొన్నారు.