విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా సబ్ జూనియర్ షూటింగ్ బాల్ (16 ఏళ్ల లోపు బాల బాలికల ) జిల్లా జట్టు ఎంపికలు విజయవంతంగా నిర్వహించినట్లు షూటింగ్ బాల్ అసోసియేషన్ శ్రీ సత్యసాయి జిల్లా ఇన్చార్జ్ జింక ఉదయ్ కిరణ్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానం నందు నిర్వహించడం జరిగింది అని, ఈ సెలక్షన్స్ కూ దాదాపుగా 90 మంది బాల బాలికలు పాల్గొనడం జరిగిందన్నారు. హిందూపురం నుంచి బాలుల పాఠశాల అయినటువంటి ఏపీఎస్ డబుల్ ఆర్ ఎస్, ధర్మవరం పట్టణం నుంచి జీవన జ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ,గవర్నమెంట్ హై స్కూల్, కాకతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్, వంశీకృష్ణ ఇంగ్లీషు స్కూల్ , హిందూపురం నుంచి బాలికల పాఠశాల అయినటువంటి డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకులం , పెనుకొండ ఏపీ టీ డబ్ల్యూ ఆర్ పాఠశాల ఎంపికలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పి ఈ టీ లు నాగేంద్ర ,మల్లికార్జున , రేణుక ,రూప,గణేష్, రాజేష్, సత్య సాయి జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ సభ్యులు సేక్షావలి, నాగేంద్ర, బడిమల మోహన్లు పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. ఎంపికైన వారు జిల్లా జట్టు జట్టుగా ఆగస్టు 11 వ, 12 వ తేదీలలో చిత్తూరు జిల్లా కుప్పం లో జరుగుతున్నటువంటి అంతర్ జిల్లా ఛాంపియన్షిప్ లో పాల్గొనడం జరుగుతుంది అని తెలిపారు.