ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు శివ
విశాలాంధ్ర ధర్మవరం:: ఆదివారం రాప్తాడులో ప్రభుత్వం తలపెట్టిన సిద్ధం అనే కార్యక్రమంలో న్యూస్ కవరేజ్ చేసేందుకు వెళ్లిన ఫోటోగ్రాఫర్ కృష్ణ పై దాడి చేసిన వారందరినీ కూడా వెంటనే అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు శివ తెలిపారు. అనంతరం శివ మాట్లాడుతూ వైసీపీ అల్లరిముకలు ఏకంగా దాడి చేసి తీవ్రంగా కృష్ణను గాయాల పాలు చేయడం సరైన పద్ధతి కాదని తెలిపారు. వైయస్సార్సీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జర్నలిస్టులపై వివిధ రూపాల్లో దాడులు చేస్తున్నారని వారు మండిపడ్డారు. మునుముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని లేనియెడల జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్, రాజా, అభిరామ్, మహేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఎఫ్ఐ అండ్ ఏఐఎస్బి ఆధ్వర్యంలో::: ఫోటోగ్రాఫర్ కృష్ణ పై దాడి చేసిన వారందరినీ కూడా చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగార్జున, ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతులయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏఐఎస్బి జిల్లా సహాయ కార్యదర్శి సాయికిరణ్, ఏఐఎస్బి పట్టణ అధ్యక్షులు చిన్న వెంకీ, నాయకులు విజయ్, అరుణ్, నంద,రాజు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.