డాక్టర్ ఎస్. పద్మావతి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పార్థసారధి నగర్,పుట్టపర్తి రోడ్డులో గల దేవీ నర్సింగ్ హోమ్ లో ప్రతి రెండవ శుక్రవారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఉచిత సంతాన సాఫల్య అవగాహన శిబిరమును సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ నిర్వాహకురాలు డాక్టర్ ఎస్. పద్మావతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు పుట్టకపోవడం అనేది చికిత్స చేయదగిన మరొక వైద్య స్థితి అని తెలిపారు. అనేకసార్లు గర్భస్రావాలు కావడం, రిపోర్టులు మామూలుగా ఉన్నప్పటికీ గర్భం దాల్చక లేకపోవడం, పి సి ఓ ఎస్ సమస్యలు, ఫాలోపియన్ ట్యూబ్ పోవడం, అనేక ఐయుఐ లేదా ఐవీఎస్ వైపర్యాలు పొందడం లాంటివి జరుగుతూ ఉంటాయని తెలిపారు. వీటన్నింటికీ సరియైన వైద్య చికిత్స తో పాటు సంతాన సాఫల్య పై తగిన ఆరోగ్య వైద్య చికిత్సలను కూడా డాక్టర్ లావణ్య కూడా వివరిస్తారని తెలిపారు. కావున సంతానం లేని వారు ఇటువంటి అవగాహన శిబిరమును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.