జిల్లా గ్రంథాలయ సంస్థ ముఖ్య కార్యదర్శి రమ
విశాలాంధ్ర- ధర్మవరం : గ్రంథాలయములో సభ్యత్వము పెంచేలా అందరూ కృషి చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ముఖ్య కార్యదర్శి రమా తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మవరంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన గ్రంథాలయమును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం గ్రంథాలయములోని పలు రికార్డులను వారు తనిఖీ చేశారు. గ్రంథాలయం అందరికీ అనుకూలించే విధంగా పాఠకులను కూడా పెంచాల్సిన బాధ్యత గ్రంథాలయ సిబ్బందితే అని వారు తెలిపారు. అదేవిధంగా ప్రాథమిక పాఠశాల నుండి హైస్కూల్ స్థాయి వరకు గ్రంధాలయమునకు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు. పాఠకులకు కావలసిన అన్ని రకాల పుస్తకాలను గుర్తించి, తెప్పించాలని వారు సూచించారు. గ్రంథాలయ శుభ్రత పట్ల కూడా శ్రద్ధ ఉంచాలని తెలిపారు. గ్రంధాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు. దాతల ద్వారా కూడా పలు కార్యక్రమాలను నిర్వహించే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి, సిబ్బంది సత్యనారాయణ, రమణ, శివమ్మ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.