Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

లోకేష్ యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలియచేసిన తెదేపా నాయకులు

యువగళం జన గళంగా మారి ప్రకంపనలు సృష్టిస్తోంది.

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ లోని తెదేపా కార్యాలయంలో మంగళవారం నాటికి నారా లోకేష్ యువగలం పాదయాత్ర 2000 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సవితమ్మ కార్యాలయం నందు చర్చా వేదిక ఏర్పాటు చేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేసి నారా లోకేష్ పాదయాత్ర కు మద్దతుగా పెద్ద ఎత్తున సంఘీభావం తెలియజేశారు. అనంతరం సవితమ్మ మాట్లాడుతూ యువగలం జనగళంగా మారి ప్రకంపనలు సృష్టిస్తోంది,ఎన్ని కేసులు పెట్టినా అదరకుండా, బెదరకుండా 153రోజుల్లోనే 50శాతం లక్ష్యాన్ని అధిగమించడం లోకేశ్ పట్టుదల కార్యదీక్షకు నిదర్శనం .నారలోకేశ్ యువతను ఉత్తేజపరుస్తూ సామాన్యులకు చైతన్య పరుస్తున్నాడు, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా లోకేష్ పాదయాత్ర చేస్తూ 2,000 కిలోమీటర్లకు చేరుకోవడం అభినందనీయం , యువగలం జన సునామీలో వైసిపి కొట్టుకోవడం ఖాయం లోకేష్ పాదయాత్రలో ప్రత్యర్థులు గిల గిల లాడుతున్నారు . యువగలం పాదయాత్రకు విశేషమైన జనమే వైసిపి ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని 2024 లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాబట్టి విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు మినీ మ్యాన ఫిస్టోని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రజలను చైతన్య పరచాలని తెలియ చేశారుఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img