విశాలాంధ్ర- పెనుకొండ : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంద్ పిలుపు మేరకు సోమవారం తెలుగుదేశం పార్టీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలతో కలసి పెనుకొండలో నేషనల్ హైవే దిగ్బంధం చేశారు, అనంతరం పోలీస్ లు పార్థసారధిని తెదేపా కార్యకర్తలను నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.