– UTF డిమాండ్
విశాలాంధ్ర ధర్మవరం:: సిపిఎస్ ఉద్యోగులను జిపిఎస్ లోకి వెంటనే ప్రభుత్వం తీసుకొని వచ్చేలా చర్యలు తీసుకుంటూ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని యుటిఎఫ్ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు సే ట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయము నందు సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి, గ్యారెంటీ పెన్షన్ స్కీం పేరిట అమలులోకి తీసుకువచ్చిన జిపిఎస్ విధానంను అమలుపరిచే విధంగా ప్రస్తుత ప్రభుత్వం గెజిట్ విడుదల చేయాలని వారు డిమాండ్ కేసు వారు తీవ్రంగా ఖండించారు.
ఉద్యోగ ఉపాధ్యాయులకు సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని యుటిఎఫ్ ఆధ్వర్యంలో పలు దఫాలుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిరంతర పోరాటాలు సాగించిందని వారు గుర్తుచేశారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయగలిగిన కూటమి ప్రభుత్వం, అదే గత ప్రభుత్వం తెచ్చిన జిపిఎస్ చట్టాన్ని ఎందుకు రద్దు చేయలేదని వారు ప్రశ్నించారు. అలా చేయని పక్షంలో యుటిఎఫ్ ఆధ్వర్యంలో మళ్ళీ ఉద్యోగ, ఉపాద్యాయులందరూ ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని తెలిపారు .
కాబట్టి వెంటనే జిపిఎస్ చట్టాన్ని రద్దుచేసి, ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు రామకృష్ణ నాయక్, రాంప్రసాద్, పెద్దకోట్ల సురేష్, సాయి గణేష్ ,రామాంజనేయులు,,శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.