Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Sunday, September 29, 2024
Sunday, September 29, 2024

ప్రజలందరికీ సేవలు చేయడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యం..

రోటరీ క్లబ్ డిజిఎన్ డి కేశవరెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: ప్రజలందరికీ సేవలు చేయడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యము అని రోటరీ క్లబ్ డిజిఎన్ డి కేశవరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో బిడ్డకు పాలు ఇచ్చు గదిని (బేబీ ఫీడింగ్ రూమ్) ను వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కేశవరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రోటరీ క్లబ్ లో విధులు నిర్వహిస్తున్న నరేందర్ రెడ్డి వారి నాన్నగారైన కీర్తిశేషులు కొత్తపల్లి ఉలిక్కి రెడ్డి జ్ఞాపకార్థం 45 వేల రూపాయలతో ఈ గదిని నిర్మించి, తల్లులకు అంకితం చేయడం నిజంగా సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఎంతో అత్యవసర కుటుంబ అవసరాల నిమిత్తం ప్రయాణ సమయంలో బస్టాండులో నిరీక్షణ చేసే సమయంలో తల్లికి పాలు ఇవ్వడానికి ఇటువంటి గదిని ఏర్పాటు చేయడం నిజంగా గర్వించదగ్గ, సంతోషించదగ్గ విషయమని వారు తెలుపుతూ రోటరీ క్లబ్ కమిటీతో పాటు నరేందర్ రెడ్డిని కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. రోటరీ క్లబ్ తరఫున ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం కేవలం ధర్మవరం రోటరీ క్లబ్ కి సాధ్యమైందని వారు తెలిపారు. వందలాదిమంది తల్లులకు ఈ గది ఒక దేవుని గదిగా, వారి సొంతింటి ఇల్లుగా అగుపడుతుందని తెలిపారు. ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ రోటరీ క్లబ్ చేస్తున్న సేవలను గుర్తించి బిడ్డకు పాలు ఇచ్చు గదిని ఏర్పాటు చేయుటకు అవకాశం ఇచ్చిన వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు. రోటరీ క్లబ్ నాటి నుండి నేటి వరకు భవిష్యత్తులో కూడా ప్రజలకు సేవలు చేస్తూనే ఉంటుంది అని వారు తెలిపారు. అనంతరం ఇంచార్జ్ డిఎం శ్రీరాములు, ఆర్టీసీ ఉద్యోగులు రోటరీ క్లబ్ వారికి ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ, కార్యదర్శి నాగభూషణం కోశాధికారి సుదర్శన్ గుప్తా, కృష్ణమూర్తి శివయ్య కొండయ్య రమేష్ బాబు, ఆర్టీసీ ఉద్యోగులు ప్రేమ్ కుమార్, ఓబులేసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img