శ్రీ సత్య సాయి సేవా సమితి
విశాలాంధ్ర ధర్మవరం:: రోగులకు సేవ చేయుటలోనే ఎంతో సంతృప్తి ఉందని శ్రీ సత్యసాయి సేవాసమితి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు ఉదయం 150 మందికి పాలు, బ్రెడ్లు, మధ్యాహ్నం 360 మందికి భోజనపు ప్యాకెట్లను వాటర్ ప్యాకెట్స్ ను డాక్టర్లు, సిస్టర్ల చేతుల మీదుగా రోగులకు, సహాయకులకు పంపిణీ చేశారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్ అని కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నాటి సేవాదాతగా కుమారి కరణం గాయత్రి జన్మదినోత్సవం సందర్భంగా రోగులకు భోజనపు ప్యాకెట్లను పంపిణీ చేయడం మాకు ఎంతో సంతోషాన్నిచ్చిందని వారు తెలిపారు. దాతల సహాయ సహకారంతోనే ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతి వ్యక్తి సేవా గుణాన్ని అరవర్చుకున్నప్పుడే సమాజంలో మానవత దృక్పతాలు మరింత పెరిగే అవకాశం ఉన్నాయని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఆసక్తి గల సేవాదాతలు ముందుకు రావాలని, సెల్ నెంబర్ 9966047044 గాని 9030444065కు గాని సంప్రదించాలని తెలిపారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సేవా సమితి వారు నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమం అందరికీ స్ఫూర్తిగా ఉంటుందని, రోగులకు సహాయకులకు ఈ సేవా కార్యక్రమం వరం లాగా మారిందని తెలుపుతూ ప్రభుత్వ ఆసుపత్రికి తరఫున వారు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.