మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్
విశాలాంధ్ర-ధర్మవరం:: పట్టణంలో నీటి సరఫరాకు సంబంధించి పార్నపల్లి వాటర్ వర్క్స్ నందు మెయిన్టెనెన్స్ వర్క్స్ ఉన్నందున ఆగస్టు 2వ ,3వ తేదీలలో నీటి సరఫరా ఉండదని మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్ తెలిపారు. కావున ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవలసిందిగా వారు తెలిపారు. రెండు రోజులు నీటి సరఫరా లేదని ప్రజలు కూడా తమ సహాయ, సహకారాలు అందించాల్సిందిగా కోరారు. నీటి సరఫరా ఇబ్బంది సమాచారాన్ని పత్రికా ముఖంగా కూడా తెలియజేయడం జరిగిందని తెలిపారు.