రాయలసీమ బలిజ సంఘం ,…
విశాలాంధ్ర: చిలమత్తూరు రూరల్,….
శ్రీ సత్య సాయి జిల్లా : ఇటీవల రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ప్రోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై జరిగిన దాడికి నిరసనగా బుధవారం రాజకీయాల కతీతంగా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రాయలసీమ బలిజ సంఘం ఆధ్వర్యంలో చిలముత్తూరు బస్టాండ్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తాసిల్దార్ కు వినతిపత్రం అందజేసి అనంతరం పోలీస్ స్టేషన్లో వినతి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా దాడి చేసిన వారిని కఠినముగా శిక్షించి పత్రిక వ్యవస్థను వారి స్వేక్షను కాపాడాలని బలిజ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు ఎల్ఐసి రమణ, ఎస్ ఎల్ వి రమణ, రామాంజనేయులు, సంజీవప్ప, నరసింహులు, పాలు నరసింహులు , పాపన్న, నంజుండప్ప, శ్రీనివాసులు, టి గోవర్ధన్ బాబు, బి కిరణ్ కుమార్ ,పి రంగనాథ్, మురళీకృష్ణ , విజయ్ కుమార్, అశోక్, కటారి చంద్ర, తదితర బలిజ సంఘం సభ్యులు పాల్గొన్నారు.