విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ప్రతినిధులు
విశాలాంధ్ర ధర్మవరం:: జమ్మూ కాశ్మీర్ లోని వైష్ణవ దేవి ఆలయానికి వెళుతున్న హిందూయాత్రికులపై కాల్పులకు తెగబడిన పాకిస్తాన్ ఉగ్రముకులను వెంటనే అరెస్టు చేసి ఉరితీయాలని విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించారు. అనంతరం వారు కాలేజీ సర్కిల్ నుండి ర్యాలీగా వస్తూ కళాజ్యోతి ఎన్టీఆర్ సర్కిల్ వరకు చేరుకొని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి పాకిస్తాన్ ఉగ్రవాద దిష్టిబొమ్మాన్ని దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులను వెంటనే అరెస్టు చేయాలని, దేశానికి అన్ని రకాలుగా చెడును కలిగిస్తూ, చంపడమే ధ్యేయంగా ఉన్న వారందరినీ వెంటనే శిక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిరియాల అంజి, దూలప్ప, విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.