విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణంలోని ఎల్ సి కె పురం పురపాలక ఉన్నత పాఠశాలలో టీచ్ టూర్ అనే శిక్షణా కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా విచ్చేసిన డీఈవో మీనాక్షి దేవి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ టీచ్ టూల్ అనే శిక్షణా కార్యక్రమం ఈనెల 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు 9 రోజులు పాటు నిర్వహించబడును అని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి, రామగిరి, కనగానపల్లి, చెన్నై కొత్తపల్లి లో ఉన్న ఉన్నత పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గురించి పలు విషయాలను సూచన లను తెలియజేశారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యాశాఖ ఆదేశాల మేరకు తరగతి గదిలో అబ్జర్వేషన్ అనే కార్యక్రమం ద్వారా వారికి కేటాయించిన పాఠశాలల్లో క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ చేసి సదరు రిపోర్టును విద్యాశాఖకు పంపాలని వారు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం కూడా విద్యార్థులకు ఉపాధ్యాయుల ద్వారా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత మండల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్స్ రాంప్రసాద్, సుమన,సుధాకర్, జగదీష్, నాగభూషణం, వెంకటరాముడు, వెంకటరమణ, వెంకటాచలం, కార్యక్రమ నిర్వహణ అధికారి అబ్దుల్ మాలిక్, ఎం ఈ ఓ లు- రాజేశ్వరి దేవి,గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.