విశాలాంధ్ర-ధర్మవరం:: తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కళాభిషేకం నిర్వాహకులైన అంజినప్పకు (పి సి ఎం ఆర్ రూప రాజా పాఠశాల ఉపాధ్యాయులు) వారి కళాకారులను ప్రోత్సహిస్తూ తన విశేషమైన కళాసేవకు విశాఖ ఉషారాణి కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు వంకాయల మారుతీ ప్రసాద్ విశాఖ పట్టణం మధ్యలో పాలెం కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా సత్కరించారు. ట్రస్టు వ్యవస్థాపకులుగా ఉంటూ వందల యాది మంది కళాకారులను ప్రోత్సహిస్తూ తన విశేషమైన కళాసేవకు మంచి గుర్తింపును తెచ్చుకున్న సందర్భంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఇందుకు తనను ప్రోత్సహించిన తమ ట్రస్ట్ సభ్యులకు శ్రేయోభిలాషులకు స్వయంగా అంజినప్ప ప్రత్యేకతలను తెలియజేశారు. విశాఖపట్నంలో ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అంతర్జాతీయ రంగస్థలం సీనియర్ నటులు కురిటి సత్యం నాయుడు, కార్యదర్శి ఉప్పాడ అప్పారావు, సినీ దర్శకులు, నిర్మాత, నటులు అయినవోలు ప్రసన్న కుమార్, లీడర్ పత్రికా సంపాదకులు, రైటర్స్ అకాడమీ చైర్మన్ రమణమూర్తి, విజయ్ నిర్మాణ అధినేత సురపనేని విజయ్ కుమార్, మాజీ సీఎం రోశయ్య అల్లుడు కృష్ణ ప్రసాద్, మాజీ డిప్యూటీ మేయర్ ఏపీ మా అధ్యక్షులు సత్యనారాయణ, జీవీఎంసీ జోనల్ కమిషనర్ నల్లనయ్య, మాతా రికార్డింగ్ అధినేత నాగభూషణం తదితర ప్రముఖులు, తేనే తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ఉత్తరాంధ్ర గౌరవాధ్యక్షులు డాక్టర్ సామవాదం బాలసుబ్రమణ్యం ప్రముఖ కళాకారులు కళాపోషకుల చేతు మీదుగా ఈ ఘన సన్మానం జరగడం నాకెంతో ఆనందదాయకమని తెలిపారు.