విశాలాంధ్ర- ధర్మవరం:: గత కొన్ని నెలల కిందట అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనుమతితో పుట్టపర్తి రోడ్డు వద్ద మాంగల్య షాపింగ్ మాల్ను ప్రారంభం పెద్ద ఎత్తున చేశారు. కానీ నేడు అది పట్టణంలోని చిన్నా పెద్ద వ్యాపారస్తులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. అప్పట్లో కేతేటి వెంకట్రాం రెడ్డికి పట్టణ వ్యాపారస్తులు మాంగళ్య షాపు ప్రారంభోత్సవానికి అనుమతి వద్దు అని తెలిపిన కూడా పెడచెవిని పెట్టి, నేడు వ్యాపారస్తుల జీవనోపాధి ప్రశ్నార్థకమైంది. ఇందులో భాగంగానే ధర్మవరం పట్టు చీరల తయారీ అండ్ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిర్రాజు రవి, రెడీమేడ్ అండ్ టెక్స్టైల్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోటి వెంకటేష్, రెడీమేడ్ అండ్ గార్మెంట్స్ టెక్స్టైల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలూరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సెమీ నారాయణా స్వామి దేవాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు మాంగల్య షాపింగ్ మాల్ వంటి సంస్థలు ధర్మవరం పట్టణంలో వెలిశాయని, దీంతో పట్టణంలోని చిన్న పెద్ద వ్యాపారస్తుల యొక్క వ్యాపారాలు పూర్తిగా డీలపడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తూ గత సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ నెల 18వ తేదీన పట్టణ వ్యాపారస్తులతో మాంగల్య షాపింగ్ మాల్ వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 2000 మంది వ్యాపారస్తులతో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్క వ్యాపారస్తుడు గురువారం తమ షాపులను స్వచ్ఛందంగా బంద్ చేసి, ర్యాలీ ద్వారా ధర్నాలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. తొలుత పుట్లమ్మ గుడి నుంచి పట్టణంలోని పలు కూడలిల ద్వారా పెద్ద ఎత్తున ర్యాలీగా మాంగల్య షాపింగ్ మాల్ వద్దకు చేరుకోవడం జరుగుతుందని తెలిపారు. మాంగల్య షాపింగ్ మాల్ పూర్తిగా మూసివేసేంతవరకు ప్రతిరోజు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కనీసం పట్టణంలోని వ్యాపారస్తులకు బోనీ కూడా కావడం లేదని, జీవన విధానం కుంటుపడిందని, పిల్లల యొక్క చదువులు ప్రశ్నార్థకం అయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుమునుపే చెన్నై సిల్క్స్ అప్పట్లో ధర్మవరంలో వ్యాపారం కొనసాగి కొనసాగించేందుకు ప్రయత్నం చేయగా, పట్టణ వ్యాపారస్తులంతా కలిసికట్టుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు సహకరించి ఆ షాపును ధర్మానములో రాకుండా సహకరించారని వారు గుర్తు చేశారు. రాజకీయాలు చోటు చేసుకోవడం వల్ల మా పట్టణ వ్యాపారస్తుల జీవన విధానం తలచుకుంటేనే ఎంతో ఆందోళనకారంగా ఉందని వారు తెలిపారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాంగల్య షాపింగ్ మాల్ ప్రారంభమైతే, పట్టణ అభివృద్ధి జరుగుతుందని ఓ మాటతో ధర్మవరం వ్యాపారస్తుల వ్యాపారం పూర్తిగా పడిపోవడంతో, ఇప్పటికే పదుల సంఖ్యలో వ్యాపారస్తులు తమ దుకాణాలను మూసివేశారు అని తెలిపారు. ప్రస్తుతం పట్టణ వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టి, అప్పులు చేసి, వ్యాపారాలు జరగక తీవ్ర కృష్ణ పరిస్థితుల్లో ఉన్నారని, ఆత్మహత్యలే భవిష్యత్తులో శరణ్యమవుతుందన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. ప్రజలు బ్రతికేందుకు చట్టాలు ఉండాలి గాని, బ్రతకనీయకుండా పొంతన లేని చట్టాలు చేయడం వల్లనే నేడు ఈ దుస్థితి ఏర్పడిందని తెలిపారు. అంతేకాకుండా తాను ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం ప్రకారం మాంగల్య షాపు యొక్క వివరాలు తెలుసుకున్నానని, టౌన్ ప్లానింగ్ ప్రకారం పూర్తిగా లేదని వారు తెలిపారు. మరి అప్పట్లో కేతిరెడ్డి మాటలు విని మున్సిపల్ అధికారులు ఎలా అనుమతిచ్చారో తెలపాలని వారు ప్రశ్నించారు. ప్రజల జీవన విధానం పై చట్టాలు మార్చాలని తెలిపారు. చట్టాలు బ్రతికి ఉండడానికి మేలు చేసే విధంగా ఉండాలని తెలిపారు. అందుకే “మన ఊరు- మన దుకాణం” అన్న నినాదంతో తాము ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్టు వారు తెలిపారు. పట్టణంలో స్థానిక వ్యాపారస్తుల వ్యాపారాలు జరగాలి అంటే తప్పనిసరిగా మాంగల్య షాపింగ్ మాల్ను మూసివేసిందేనని స్పష్టం చేశారు. లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలా? ఊరి వదిలిపెట్టి వెళ్లాలా? మరి వ్యాపారస్తుల జీవన విధానం ఎలా? అని వారు ప్రశ్నించారు. ఏది ఏమైనా గురువారంనాడు జరిగే ఈ ధర్నా కార్యక్రమానికి పట్టణంలోని చిన్న, పెద్ద వ్యాపారస్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని, ర్యాలీని, ధర్నాను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.