Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాదుర్గమ్మను దర్శించుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ

దుర్గమ్మను దర్శించుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ

- Advertisement -

ఆలయం మర్యాదలతో ఈవో చైర్మన్ ప్రత్యేక పూజలు

విశాలాంధ్ర – ఇంద్రకీలాద్రి : ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ (Art of Living) వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ బుధవారం నాడు ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఆయనతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు (Ex-MP) గోకరాజు గంగరాజు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన రవిశంకర్ గురూజీ గారికి దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), దేవస్థాన కార్యనిర్వహణాధికారి (EO) వీ.కే. సీనా నాయక్ మరియు పాలకమండలి (ట్రస్ట్ బోర్డ్) సభ్యులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. గురూజీ మరియు ప్రముఖుల పర్యటన నిమిత్తం ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం వారు అంతరాలయంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులు వారికి వేదాశీర్వచనం పలకగా, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటమును గురూజీకి బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు