Monday, March 20, 2023
Monday, March 20, 2023

పోలింగ్ కు సర్వం సిద్ధం

-సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్

విశాలాంధ్ర – శ్రీకాకుళం : జిల్లాలో స్థానిక సంస్థలు ఎన్నికలకు నాలుగు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, పట్టభద్రుల శాసనమండలి కి 59 కేంద్రాలు కలిపి 63 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 300 బ్యాలెట్ బాక్సులు సిద్దం చేసామని శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి ఎం.నవీన్ అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలో పలు కేంద్రాల్లో స్ట్రాంగ్ రూమ్స్ మరియు పోలింగ్ మెటీరియల్ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వేసవిని దృష్టిలో పెట్టుకొని పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి 52వేల మంది ఓటర్లు ఉన్నారని, స్థానిక సంస్థలకు 776 మంది ఓటర్లు ఉన్నారని జేసీ వెల్లడించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 38మండలాల పరిధిలో ఉన్న ఎం.పి.టి.సి., జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సెలర్స్ ఓటు హక్కును వినియోగించికుంటారు. నాలుగు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో స్థానిక సంస్థలకు 4పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టభద్రుల శాసనమండలికి సంబంధించి ఓటర్లకు ఓటింగ్ స్లిప్ ల పంపిణీ 40 శాతం పూర్తి అయిందని, మిగిలిన 60 శాతం మూడు రోజుల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ లు ఏర్పాటు చేస్తున్నామని, ఓటర్లు నిర్భయంగా ఓటుహక్కును వినియోగించుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని జేసీ నవీన్ అన్నారు. ఈ ఎన్నికలకు సుమారు 2వేల మంది సిబ్బందిని విధులకు వినియోగిస్తున్నామని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img