Friday, September 30, 2022
Friday, September 30, 2022

సీతానగరంలో ఘనంగా జరిగిన 120అడుగుల త్రివర్ణ పతాక ర్యాలీ

ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జోగారావు

విశాలాంధ్ర, సీతానగరం: అజాది కా అమృత్ ఉత్సవ్ లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంను సీతానగరం మండలకేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. 120అడుగుల పొడవుగల త్రివర్ణపతాకా ర్యాలీని స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే జోగారావు ప్రారంబించారు. అంతకుముందు రెవెన్యూ కార్యాలయం వద్ద జాతిపిత మహాత్మాగాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 120అడుగుల జాతీయజెండాను ఎమ్మెల్యే జోగారావు, ప్రజాప్రతినిదులు, నాయకులు,అన్నిశాఖలఅధికారులు, విధ్యార్ధులు, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, గ్రామవాలంటీర్లు పట్టుకొని భారత్ మాతాకు జైజై అని నినాదాలు చేస్తూ పురవీదుల గుండా స్థానిక ఎం ఆర్ సి పాటశాల వరకు ఉత్సాహంగా నిర్వహించారు.ర్యాలీ అనంతరం మండల విద్యాశాఖా కార్యాలయం వద్ద ఎమ్మెల్యే అలజింగి జోగారావు అజాది కా అమృత్ ఉత్సవ్ కార్యక్రమం గూర్చి వివరించారు.భారత దేశానికి స్వాంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో చేస్తున్న కార్యక్రమాలపై చక్కని సందేశాన్ని అందించారు. అంతా సామాజిక స్పృహతో మూడు రోజుల పాటు ఘనంగా కార్యక్రమాలని చేయాలని పిలుపునిచ్చారు. ప్రతీఇంటిపైన జెండా ఎగురవేయాలని కోరారు. ఇప్పటికే అన్ని కుటుంబాలకు జాతీయ జెండాలను పంపిణి చేశామని చెప్పారు. ఈరోజున దిగ్విజయంగా కార్యక్రమం చేయడంపట్ల అందరినీ ఎమ్మెల్యే అభినందించారు.
ఈకార్యక్రమంలో ఎంపీపీ రవనమ్మ, జెడ్పీటీవీ బాబ్జి, నాయకులు బొంగు చిట్టిరాజు, శ్రీరాములునాయుడు, ఆర్వీ,గరికయ్య, కిరణ్,సూర్యనారాయణ,అరవింద్,సురేష్,రమేష్,రామారావు, తిరుపతిరావు, ఎంపిడిఓ ప్రసాద్, ఎస్ఐ నీలకంఠం, ఎంఈఓ సూరిదేముడు, ఈఓపిఆర్డి వర్మ, వెలుగు ఏపిఎం శ్రీరాములు నాయుడు,వైద్యులు శిరీష,నీలిమ,హేమాక్షి, గృహనిర్మాణశాఖ ఏఈజానకీరాం, ఉన్నత పాఠశాల హెచ్ ఎం ఇళ్లాప్రసన్నలక్ష్మి, పి ఆర్ టి యు జిల్లా అద్యక్షులు వోలేటి తవిటినాయుడు, ఏపిటిఎఫ్ రాష్ట్రనేత చుక్క శ్రీదేవి, ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు రవికుమార్, ఆర్యవైశ్య సంఘం నేతలు విశ్వేశ్వరరావు,సత్యనారాయణ, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శిలు, వైద్యసిబ్బంది,సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్సార్సీపీ నాయకులు,అంగన్వాడీకార్యకర్తలు, ఆశాకార్యకర్తలు, స్తానిక ప్రాధమిక పాఠశాల విద్యార్థులు, ఉన్నత పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, వెలుగు సిబ్బంది, మండల పరిషత్ సిబ్బంది, మహిళలు, యువకులు జెండాలను పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలుచేస్తూ ఈభారీర్యాలీ నిర్వహించారు. ఎస్ ఐ నీలకంఠం అధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img