Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మండలంలో పంటపొలాల్లో ఉన్న ఏనుగుల గుంపు

విశాలాంధ్ర,సీతానగరం: ఏనుగులగుంపు సీతానగరం మండలములో అనంతరాయుడుపేట గ్రామానికి దగ్గరలోని ప్రకాశ్ పంటపొలాల్లో శనివారం ఉదయం నుంచి తిష్టవేసిఉన్నాయి. నాలుగు రోజులుగా ఇక్కడేఉండటంతో పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరిపంట, చెరకు పంట, అరటితోటలు నాశనం చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు.సీతానగరంకు చెందిన ప్రకాష్ , ముప్పాళ మురళి, రమణ మూర్తి, అనంత రాయుడుపేట గ్రామానికి చెందిన ఇద్దరు రైతుల పంటలను నాశనం చేశాయి.గతవారం రోజులనుండి ఏనుగులువల్ల పంట నాశనం చేస్తున్నాయనిపలువురు రైతులు తెలిపారు మండలంలో ప్రజలు, సందర్శకులు ఏనుగులు వద్దకు రావద్దని అటవీశాఖ,పోలీస్ సిబ్బంది విజ్ఞప్తి చేస్తూ కాస్తున్నారు. ఏడు ఏనుగులు కలసి ఉండి పంటలను కుమ్మివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈప్రాంతంనుండి ఏనుగులను తక్షణమే తరలించాలని రైతులు కోరుతున్నారు. పంటలు చేతికి వచ్చే సమయంలో ఏనుగులు వల్ల రైతులకు నష్టం జరుగుతుందని రైతులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img