Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మోటారురంగ కార్మికులకు సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి

ఏఐటీయూసీ జిల్లాకార్యదర్శి తోటజీవన్న

విశాలాంధ్ర, పార్వతీపురం/జియ్యమ్మవలస:మోటారు రంగ కార్మికులకు సంక్షేమబోర్డు ఏర్పాటు చేసి వారుఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి తోటజీవన్న డిమాండ్ చేసారు.పెదమేరంగి కూడలిలో యూనియన్ ప్రెసిడెంట్ ఎం పోలినాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆటో రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని  డిమాండ్ చేసారు,ఎంతకష్టపడినా ఆర్టీవో  వేదింపులు, పెరుగుతున్న పెట్రోల్,డీజిల్ ధరలతో ఆటోకార్మికుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలవలన  రవాణారంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఆటో కార్మికులను ఆదుకునేందుకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలపై నియంత్రణ లేకపోవడం వలన రవాణా రంగంపై పెనుభారం పడుతుందని, పెట్రోల్ దీజిల్ ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.స్థానికంగా  ఆటోస్టాండ్లలో కూడా అనేక సమస్యలు ఉన్నాయని ఈసమస్యల పరిష్కారానికి స్థానిక అధికారులు కృషిచేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు గరుగుబిల్లి సూరయ్య, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు రాజు, సతీష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
గుంతలపడ్డ రోడ్లను వెంటనే మరమ్మత్తులు చేయాలి.:ఏవైఎఫ్కు రుపాం నియోజక వర్గంలో గుంతల పడ్డ రోడ్లను తక్షణమే మరమ్మత్తులు చేయాలని ఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి బిటి నాయుడు  డిమాండ్ చేశారు.గురువారం స్థానిక పెద మేరంగి కూడలి వద్ద గతుకుల రోడ్లు మరమ్మత్తులు చేయాలని అధికారులను కోరారు.ఈకార్యక్రమంలో స్థానిక యువత శ్రీరాములు, రవి,చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img