Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులపై శ్వేత పత్రం విడుదల చేయాలి

ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పరుచూరి. రాజేంద్ర బాబు, నక్కి లెనిన్ బాబు

విశాలాంధ్ర – శ్రీకాకుళం : రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులపై శ్వేత పత్రం విడుదల చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పరుచూరి రాజేంద్ర బాబు, నక్కి లెనిన్ బాబు డిమాండ్ చేశారు.
అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా 23వ మహాసభ శ్రీకాకుళం జిల్లా రామ లక్ష్మణ సెంటర్ లోని దాసరి నాగభూషణ రావు, క్రాంతి భవన్ నందు జిల్లా కో కన్వీనర్ కె. శ్రీనివాస్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు.
ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల పై శ్వేత పత్రం విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత వై యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ శాఖల్లో 2,35,794 పోస్టుల ఖాలీగా ఉన్నాయి. అధికారం లోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలూ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పారు.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయమంటే వాలంటీర్ పోస్టులు ఇచ్చాం అనీ నిరుద్యోగ యువతను మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, నిరుద్యోగ యువతకు 10 వేల రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లించాలని, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చొరవ తీసుకుని మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగ యువత గా ఉద్యోగాలూ సాధించుకునేందుకు అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ చేసే పోరాటాలలో కలసిరావాలనీ పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎఐ వైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మొజ్జాడ.యుగంధర్, సిపిఐ జిల్లా కార్యదర్శి బి. శ్రీరాంమూర్తి, సహాయ కార్యదర్శి ఎల్. వెంకట్రావు లతో పాటు పలు ప్రాంతాలనుండి యువకులు పాల్గొన్నారు.

ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా నూతన కమిటీ ఎన్నిక

అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా నూతన జిల్లా అద్యక్షులు గా వై.మురళి,కార్యదర్శి గా కె. శ్రీనివాస రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా ఎం.యుగంధర్,ఉపాధ్యక్షులుగా రవి,ఎన్.సాంబ శివ రావు,కే.కృష్ణా, సహాయ కార్యదర్శలుగా కే.హరి, రమణ, కార్యవర్గ సభ్యులు గా జి. నరేష్, ఎన్.కార్తిక్,బి.ప్రభు, రాధాకృష్ణ, ఎం.శ్యామ్,రమణ,గిరి,హరీష్,రవి, మోహన్ లతో పాటు 17 మందితో నూతన సమితి ఏర్పడింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img