Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రైతులందరూ ఈ కే వైసీ చేయించుకోవాలి

విశాలాంధ్ర,పార్వతీపురం : జిల్లాలో రైతులు అందరూ ఈ-కెవైసీ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కోరారు. పి.ఎం.కిసాన్, వై.ఎస్.ఆర్.రైతుభరోసా, ఇతరప్రభుత్వ పథకాలు పొందుటకు రైతులందరూ తప్పనిసరిగా ఇ-కెవైసీ చేయించుకోవాలని ఆయన తెలిపారు. వ్యవసాయఅనుబంధ శాఖల మండలస్థాయి అధికారులతో మంగళవారం కలెక్టరు కార్యాలయంనుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ మరియు అనుబంధశాఖలైన ఉద్యానవన, పశుసంవర్దక, మత్స్య శాఖ లలో అమలవుచున్న పధకాల పురోగతిని సమీక్షించారు.సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ రైతులు పి.ఎం.కిసాన్, రైతు భరోసా, ఇతర సంక్షేమ పధకాలు పొందుటకు ఇ- కెవైసీ తప్పని సరిగా చేయించాలని, లేనిచో వారు పధకాలు పొందుటకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉండవచ్చని తెలిపారు. ప్రతి రైతు సచివాలయంలో గల గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి ఇ-కెవైసీ చేయించుకోవాలన్నారు. మార్చి మొదటి వారం నుండి రైతు భరోసా కేంద్రాలలో కస్టమర్ హైరింగ్ సెంటర్లు పనిచేయుటకు ఏర్పాట్లు చేయాలని, కస్టమర్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయుటకు సంఘాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. మొదటి విడతగా జిల్లాలో 142 సెంటర్లకు బ్యాంకు అక్కౌంట్లు తెరచి, రుణం మంజూరు చేయాలని, మార్చి మొదటి వారం నాటికి పరికరాలు తెప్పించాలన్నారు. రబీ పంటకు సంబంధించి ఇ-పంట నమోదు పూర్తిచేయాలని, వి.ఆర్.ఒ., వి.ఎ.ఎ.లచే ఆధరైజేషన్ చేయించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల పనితీరును క్రోడీకరించుటకు ఏర్పాటుచేసిన వై.ఎస్.ఆర్.యాప్ నందు పూర్తి వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ఆర్.ఓ.ఎఫ్.ఆర్, కౌలు రైతులకు పంట రుణాలు మంజూరులో దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img