విశాలాంధ్ర, సీతానగరం:మండలంలోని అధికారులు ధాన్యం ప్రక్రియలో నిమగ్నమయ్యారు. కాశాపేట గ్రామంలో రైతుభరోసా కేంద్రాన్ని, మిల్లును, రైతుల కల్లాలవద్ద ఉన్న ధాన్యం నిల్వలను ఎంపిడిఓ కృష్ణ మహేష్ రెడ్డి, మండల వ్యవసాయాధికారి యస్. అవినాష్, ఈఓ పిఆర్డీ వర్మలు శుక్రవారం ఆకస్మికంగా పరిశీలన చేశారు. రైతులసమస్యలని, మిల్లర్ల సమస్యలను, సిబ్బంది సమస్యలను తెలుసుకున్నారు.ఈఏడాది రైతులకు ఏటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యంకొనుగోలు చేసే ప్రక్రియ ప్రభుత్వము చేస్తున్న సంగతిని వివరించారు. ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై ఏఓ అవినాష్ వివరించారు. ఈకార్యక్రమంలో సెక్రటరీ మురళి,వ్యవసాయ సహాకుడు జగదీశ్, రైతులు పాల్గొన్నారు. పలు గ్రామాల్లో రైతుల నుంచి కోనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నట్లు ఏఓ చెప్పారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్,పౌరసరఫరాలఅధికారులు, జిల్లా రెవెన్యూ,వ్యవసాయ అధికారుల ఆదేశాల మేరకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.