Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

మహోన్నత వ్యక్తి అంబేద్కర్

జనసేన నియోజక వర్గ నేత అక్కివరపు
విశాలాంధ్ర,సీతానగరం: బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని బలిజిపేట మండలములో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జనసేన నేతలు అక్కివరపు మోహనరావు, బాబు పాలూరు తదితరులు నివాళులర్పించారు. అంబేద్కర్ స్ఫూర్తిప్రదాతని, రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తని కొనియాడారు. అంబేద్కర్ సమాజానికి దిశా నిర్దేశం చేశారని,అంబేద్కర్ ఆశయసాధనకు అంకితభావంతో పనిచేయాలనిపిలుపునిచ్చారు. ఆయన జయంతి రోజున చలివేంద్రంను ప్రారంభం చేసి మజ్జిగను పంపిణి చేశారు.
ఈకార్యక్రమంలో బలిజిపేట, బొబ్బిలి మండలాలకు చెందిన జనసేన సైనికులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మండలంలో జోగింపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జనసేననాయకులు నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి అల్లు రమేష్, ఆంధ్రప్రదేశ్ జనసేన నాయకులు మురళీ కోట్యాడ, కళ్యంపుడి సత్యన్నారాయణ, భాస్కర్, ప్రకాష్, బాలకృష్ణ , అఖిల్, సంతోష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img