Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

చలివేంద్రి రైతుల సమస్యకు సామరస్య పరిష్కారం

రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేత!
విశాలాంధ్ర,పార్వతీపురం : జిల్లాల్లోని వీరఘట్టం మండలం చలివేంద్రి రైతుల సమస్య సామరస్య పూర్వకంగా పరిష్కారం జరిగింది. చలివేంద్రి రైతులంతా శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంకు విచ్చేసి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, పోలీసు సూపరింటెండెంట్ వి. విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఆనంద్ లను కలుసుకున్నారు. చలివేంద్రిలో గురువారం జరిగిన సంఘటనపై రైతులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కారుఆపడం పెద్దపొరపాటన్నారు. కొంత మంది రైతులు ఆవేశపడ్డారని, ఇది మాగ్రామసాంప్రదాయం, సంస్కృతి కాదనితెలిపారు. ఆవేశంతో తెలియక పొరపాటుచేసామని మన్నించాలని కోరారు. జిల్లా కలెక్టర్ గ్రామానికి వచ్చినపుడు అనుకోని విధంగా సంఘటన జరిగిందని, పెద్ద మనసు చేసుకుని క్షమించాలని వారంతా కోరారు. పొరపాటు జరిగిందని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటన జరగవని చెప్పారు. జిల్లాకలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ధాన్యం నిల్వలపరిశీలనకు జిల్లా వ్యవసాయ అధికారి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ను శుక్ర వారం ఉదయమే పంపించి మొత్తం తీసుకురావాలని ఆదేశించామని తెలిపారు.గ్రామ సచివాలయంలో మాట్లాడుటకు రైతులను ఆహ్వానించానని, రైతులు ప్రవర్తించడం బాధనిపించిందన్నారు. ఇక్కడ ప్రజలకు మంచి సేవలు అందించాలని వచ్చానని జిల్లా కలెక్టర్ అన్నారు. ధాన్యంకొనుగోలు చేయకుండా ఉంటే మాకు మాత్రం సంతోషమా ? అనిప్రశ్నించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు ఏడాది జిల్లా అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. కలెక్టర్ ను కుటుంబసభ్యునిగా భావించండి, ఎక్కువసేవలు అందించుటకు సహకరించండని పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వి. విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంకు జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్, జాయింట్ కలెక్టరుల కార్యాలయాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. స్పందన కార్యక్రమంలో సమస్య తెలియజేసి ఉంటే పరిష్కారం అయ్యేదన్నారు. రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయడం మన సాంప్రదాయం కాదని హితవు పలికారు. రోడ్లపై ధర్నాలు, జిల్లా కలెక్టర్ వంటి వారిని నిలపడం పద్దతి కాదుకదా అని ఆయన అన్నారు. ఆవేదన ఉంటుందని దానిని చెప్పేతీరు ఉంటుందని చెప్పారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరారురైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని నిర్ణయించారని స్పష్టంగా తెలుస్తోంది.ఈకార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్టపాల్, కొంతమంది జిల్లా అధికారులు,పాలకొండ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు,చలివేంద్రి రైతులు కృష్ణంనాయుడు, రాము, జి.ఎన్.రామకృష్ణ, బి. రమణనాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img