విశాలాంధ్ర, పార్వతీపురం:గురువారం జరిగిన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా టీడీపి తరుపున పోటీ చేసిన పంచుమర్తి అనురాధ ఎన్నిక పట్ల పార్వతీపురం నియోజకవర్గం నేతలు హర్షం వ్యక్తంచేశారు. గురువారం సాయంత్రం ఫలితాలు ప్రకటన తరువాత పార్టీ కార్యాలయంలో స్వీట్లు పంచిపెట్టారు. టీడీపి ప్రభంజనం తిరుగులేనిదని దీంతో స్పష్టం అయిందని రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి, మాజీఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, టీడీపి నియోజకవర్గ ఇంచార్జి బొబ్బిలి చిరంజీవులు అన్నారు. రాష్ట్రంలోని ఇటీవల ఎన్నికలలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీల గెలుపు, ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే కోటాలో గెలిచిన ఎమ్మెల్సీతో రాష్ట్రంలో టీడీపీ పవనాలు వీస్తున్నాయని స్పష్టంగా రుజువైందన్నారు. రానున్న సాధారణ ఎన్నికలలో టీడీపీ విజయం ఖాయమని వారు స్పష్టంచేశారు. చరిత్రలోఈనలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక శాశ్వతంగా నిలుస్తుందన్నారు. ఎమ్మేల్యే కోటాలో జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగు పాల్పడటం చూస్తే ప్రభుత్వం పై అధికారపార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తుందన్నారు. వారితోపాటుమూడు మండల టీడీపీ అధ్యక్షులు గుంట్రెడ్డి రవి కుమార్,దొగ్గమోహన్, కొల్లి తిరుపతిరావు, పెంకి వేణుగోపాల నాయుడు, గర్భాపు ఉదయభాను, వాడాడ రాము, గొట్టాపు వెంకట నాయుడు, ఐటీడిపి నాయకులు బార్నాల సీతారాం,నారాయణరావు, తదితరులు ఉన్నారు.