Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కార్మికుల పిఎఫ్ కోసం కొంత కేటాయించండని కలక్టర్ కు విజ్ఞప్తి

విశాలాంధ్ర, పార్వతీపురం: లచ్చయ్యపేట ఎన్ సి ఎస్ చక్కెర కర్మాగారంలో రైతులకు బకాయిలు 16.85కోట్ల రూపాయలు చెల్లించిన అధికారులు మిగులు డబ్బులలో కార్మికులకు సంబంధించిన పి.ఎఫ్ బకాయిలగురించి కొంతడబ్బులు జమచేసి న్యాయం చేయాలని మన్యం జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ ను కార్మికులు కలిసి విన్నవించుకున్నారు. శుక్ర వారం సాయంత్రం వారు జిల్లా కలెక్టరును కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. పి ఎఫ్ కోసం కోటిన్నర కేటాయిస్తే కొంతమంది కార్మికులకు పెన్షన్ సౌకర్యం కలుగుతుందని కార్మికులు తెలిపారు. ఈకార్యక్రమంలో కార్మిక నాయకులు ఎస్. సన్యాసిరాజు,ఎస్ .త్రినాధ ,
డి.రమేష్,సత్యనారాయణ,సూర్య
నారాయణ,వెంకట్రావు తదితర కార్మికులు పాల్గొన్నారు.ఇదిలాఉండగా ఎన్ సి ఎస్ భూములను ఆర్ ఆర్ యాక్టు ద్వారా 20కోట్ల 5లక్షల రూపాయలకు అమ్మగా ఇప్పటికే రైతులబకాయిలు 16.85 కోట్ల రూపాయలు చెల్లించిన సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ యాక్టు అమలు ద్వారా వచ్చిన డబ్బులలో రైతులతరువాత తమకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని గత రెండేళ్లుగా కార్మికులుకూడా పలుసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వారు ఎన్నో నిరసనలను,ఆందోళనలు శాంతియుతంగా చేశారు. కర్మాగారం ఎదుట కొంత కాలం రిలే నిరాహారదీక్షలు కూడా చేశారు. రెండేళ్ళుగా కర్మాగారంలో గానుగ నిలిపివేయడంతో చాలా మంది కార్మికులకు గ్రాట్యుటీ, పి ఎఫ్, ఎల్ ఐ సి, జి ఐ సి తదితర బకాయిలు యాజమాన్యం చెల్లించలేదు. ప్రస్తుతం జిల్లా కలక్టర్, ఇతరఅధికారులు మానవతా దృక్పథంతో ఆలోచనచేసి పి ఎఫ్ కోసం కొంత మొత్తాన్ని కేటాయించి జమచేస్తే కొంతమంది కార్మికులకు నెల నెలా పెన్షన్ స్కీమ్ వరిస్తుందన్నది వాస్తవం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img