Friday, April 26, 2024
Friday, April 26, 2024

అంగన్వాడీ సహాయకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

ఐసిడిఎస్  పిఓ

విశాలాంధ్ర,సీతానగరం:సీతానగరం : బలిజిపేట మండలాల్లోని ఐదు అంగన్వాడీ కేంద్రాల సహాయకులు (హెల్పర్లు) పోస్టులకు నోటిఫకేషన్ జారీచేసినట్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి విజయలక్ష్మి తెలిపారు. సీతానగరంమండలంలోని అప్పయ్యపేట_2, బుడ్డిపేట, దయానిధి పురంలతోపాటు బలిజిపేట మండలములోని పి.చాకరపల్లి_2, చిలకల పల్లి_1 కేంద్రాలలో గలఖాళీలను భర్తీ చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల9లోగా సంబంధిత దృవీకరణ పత్రాలతో ఐసిడిఎస్ కార్యాలయానికి  దరఖాస్తులు అందజేయాలని ఆమె కోరారు. అప్పయ్య పేట బిసి – డికు, బుడ్డిపేట బిసి – బికు, దయానిధిపురం ఓసి – ఈడబ్ల్యుఎస్ లకు కేటాయించారు. పి చాకరపల్లి బిసి- ఈకు, చిలకలపల్లి ఓసి ఈడబ్లూఎస్ లకు కేటాయించారు. ప్రభుత్వం కేటాయించిన రోస్టర్ ప్రకారం ఆయా కేటగిరీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలనీ కోరారు. మరిన్నివివరాలకు బొబ్బిలి గ్రామీణ ఐసిడిఎస్ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img