Friday, December 1, 2023
Friday, December 1, 2023

డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన

విశాలాంధ్ర, సీతానగరం: గ్రామాల్లోని వయోజనులు డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన పెంచుకొని డిజిటల్ రూపంలో ఆర్థిక లావాదేవీల నిర్వహణ, ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లద్వారా సమాచారాన్ని తెలుసుకోవాలని ఎంపిడిఓ కృష్ణ మహేశ్ రెడ్డి పిలుపునిచ్చారు.గురువారం మండలంలోని వెంకటపురం, లక్ష్మిపురం, బూర్జ, నిడగల్లు, సూరమ్మపేట, అంటిపేట, ఆర్ వెంకమ్మపేట, రంగమ్మపేట సచివాలయాలలో కొత్తగా ఏర్పాటుచేసిన ప్రదానమంత్రి దిశ కార్యక్రమంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని చెప్పారు.వయోజనులకు డిజిటల్ అక్షరాస్యతపై డిజిటల్, వెల్ఫేర్ అసిస్టెంట్లు అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఇదిలా ఉండగా గ్రామాల్లో అర్హులైన గ్రాడ్యుయేట్ అభ్యర్థులను ఓటర్లుగా నమోదు చేయడంలో సచివాలయ సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.ఈనెల7తో గడువుసమయం ముగుస్తున్నందున దీనిపై అంతా దృష్టి సారించి నమోదు చేయాలని కోరారు.సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్ నెస్ కేంద్రాలనిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img